రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం దామరచర్లలో జరిగింది. నల్గొండ రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల శివారులో విష్ణుపురం-కొండ్ర పోల్ రైల్వే స్టేషన్ల మధ్య యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌కు వెళ్లే రైల్వే గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.