దేవరకొండ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై విద్యార్థులతో బుధవారం ఏబీవీపీ ధర్నా చేపట్టింది. రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ఏబీవీపీ శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని, అడ్మిషన్ సమయంలో పూర్తి ఫీజు వసూలు చేయడం అన్యాయమని డిమాండ్ చేశారు.