నల్లగొండ పట్టణంలో ఆర్జాలబావి-1 కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకు పలకలు, బలపాలు, నోట్‌బుక్కులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ, రేఖ నాగబాబు, సుగుణ టీచర్, మందడి లలిత, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.