సామాజిక, ఆర్థిక , రాజకీయ, విద్య, ఉపాధి, కుల సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కి సంబంధించిన సామాగ్రి అంతటిని ప్రతి ఎన్యుమరేటర్ కు అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో భాగంగా రేపటినుండి ఇండ్ల జాబితా తయారు , అనంతరం సమగ్ర సర్వే ప్రారంభించనున్న దృష్ట్యా , ఇందుకై రూపొందించిన ప్రత్యేక మెటీరియల్ ను గురువారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో తనిఖీ చేశారు.