పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ వేత్త సురేష్ గుప్త అన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం “తల్లి చెట్టు” పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేష్ గుప్త మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు పెంచడమే కాదని, మన జీవన విధానం కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని తెలిపారు.