రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. విత్తన విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. ఒకవేళ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.