చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం దెబ్బతింది, క్యాబిన్ భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్