నల్లగొండ బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలు, బ్యాగ్ కటింగ్‌లకు పాల్పడుతున్న ఒక మహిళను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మగవేషం ధరించి అమాయకులను మోసం చేస్తున్న ఈ మహిళపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.