ఎన్ జి కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

నాగార్జున ప్రభుత్వ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం ఆర్జాల బావిలోని నిధి పివిసి పైపుల తయారీ పరిశ్రమను సందర్శించారు. ఈ క్షేత్రపర్యటనలో భాగంగా, విద్యార్థులు పైపుల తయారీలోని వివిధ దశలను పరిశీలించి, యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ అధికారులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే లక్ష్యంతో ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు రసాయనశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. అంతటి శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్