కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తొలి జాబితా

నల్లగొండ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. తొలి విడతలో మొత్తం 44 మంది కార్పొరేటర్ అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆమోదంతో, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్