రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

దేవరకొండ సమీపంలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి బొల్లిగుట్ట వద్ద ఆదివారం సాయంత్రం కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో నాలుగేళ్ల ఐశ్వర్య అనే పాప మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఐశ్వర్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి చెందిన బాధితుల కుటుంబం తరపున పాప తండ్రి శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్