మహిళా సాధికారతను మరింత బలోపేతం

మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో, జిల్లాలో మహిళా సాధికారతను బలోపేతం చేస్తూ, వారిని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ పెట్రోల్ బంక్ పరిసరాల్లో మెడికల్, నర్సింగ్, మైనారిటీ కళాశాలలు, యంగ్ ఇండియా స్కూల్ వంటి విద్యాసంస్థలు ఉండటం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్