నల్గొండ: జూలై 9 సార్వత్రిక సమ్మె: సీఐటీయూ

తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం ఐడిఏ ఆర్జీల బావిలో జరిగింది. ముఖ్యఅతిథిగా యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరై మాట్లాడుతూ జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అన్ని మండల కేంద్రాల్లో జీవో కాపీల దగ్ధం చేయాలని కార్మిక శాఖ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టాలని సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని అన్నారు.

సంబంధిత పోస్ట్