నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నల్లమోతు భాస్కర్ రావు విజ్ఞప్తి చేశారు. తాను కూడా తన ఓటును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులు ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.