ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

నల్గొండ జిల్లాలో రానున్న 15 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం, పెదకాపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వట్టిమర్తిలో రైస్ మిల్లును తనిఖీ చేశారు. అనంతరం సూర్యాపేట జిల్లా వెళుతూ మార్గమధ్యంలో కామినేని ఆస్పత్రి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ధాన్యం కొనుగోలు ఏజెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్