ధాన్యం పక్కదారి కేసు.. అరెస్టులకు సిద్ధమైన పోలీసులు!

నల్గొండ: సుమారు రూ. 191 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించిన కేసులో నిందితులుగా ఉన్న రైస్ మిల్లర్లకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో పోలీసులు అరెస్టుల పర్వానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విజయవాడలో ఒక ప్రధాన మిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్