పంచాయతీ కార్యదర్శుల కోసం బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జీతాలు పెంచాలని కొట్లాడినం అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం టీపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేటలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కాంగ్రెస్ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కలిసి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.