నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చేతి పంపులు, నీటి ట్యాంకులు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. గత కొన్నేళ్లుగా ఇవి పనిచేయకపోవడంతో, బోర్లు మరమ్మతులకు గురై, మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి, నీటి ట్యాంకులను వినియోగంలోకి తెచ్చి, చేతి పంపులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.