ఆకట్టుకుంటున్న కళాసిల్క్ హస్తకళా ప్రదర్శన

నల్గొండలో అందం, హుందాతనంతో కూడిన సంప్రదాయ హస్తకళను ప్రజలకు చేరువ చేసేందుకు కళాసిల్క్ సంస్థ శ్రీకారం చుట్టింది. బుధవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన పట్టణ వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నేతన్నలకు ఆర్థికంగా చేయూతనిస్తూ, చేనేత కళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు సంస్థ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. దేశంలోని ఎంపిక చేసిన కళాకారులు నేసిన సిల్క్, పట్టుకాటన్ వస్త్రాలతో పాటు తెలంగాణలోని గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి వస్త్రాలు, అలంకరణ వస్తువులు, హోంఫుడ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్