అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా, నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెంలో పేదల కోసం ఒక్కోటి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గృహాలలో లబ్ధిదారులు శనివారం గృహప్రవేశం చేశారు. రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 107 గృహాలు మంజూరు కాగా, వాటిలో 10 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మంత్రి సమక్షంలో లబ్ధిదారులు ఘనంగా గృహప్రవేశాలు చేశారు.

సంబంధిత పోస్ట్