ఉమ్మడి నల్గొండ జిల్లా జాబ్ మేళా

మే 2న నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో జాబ్ మేళాలను నిర్వహించనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్