నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. శ్రీనివాసరాజు విద్యార్థులు సబ్జెక్టు నైపుణ్యాలతో పాటు జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల రసాయనశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 నుండి మార్చి 4 వరకు నిర్వహించిన ‘జీవన నైపుణ్యాలు- సానుకూల మనస్తత్వ శాస్త్రం” సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శనివారం కళాశాలలో సర్టిఫికెట్లు అందజేశారు. లక్ష్యాలు సాధించడానికి, జీవితంలో విజయం పొందడానికి జీవన నైపుణ్యాలు చాలా అవసరమని ఆయన తెలిపారు.