శుక్రవారం తెల్లవారుజామున యలమంచిలి మండలం పులపర్తి సమీపంలో జాతీయ రహదారిపై నీళ్ల ట్యాంకర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్ హెచ్. వెంటయ్య (51) అక్కడికక్కడే మృతి చెందాడు. అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న క్రమంలో రోడ్డు డివైడర్లపై మొక్కలకు నీళ్లు పడుతున్న ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టడంతో ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్‌లోని ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.