మాడుగులపల్లి: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యం అయ్యింది. మెరూన్ కలర్ టాప్, రెడ్ కలర్ లెగ్గిన్ దుస్తులు గల (25, 30) గుర్తు తెలియని మహిళ మృతదేహం రిజర్వాయర్‌లో కొట్టుకొని వచ్చినట్లుగా ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8712670192, 8712670151 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్