నల్గొండ: యువతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష

ప్రేమ పేరుతో వేధిస్తూ ఓ యువతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి నల్గొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ బుధవారం సంచలన తీర్పును వెలువరించారు. నిందితుడు మనిమెద్దె సాయిరాం కు ఏడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 8,000 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ఈ కేసు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నేర పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి మూడు వేర్వేరు సెక్షన్ల కింద సాయిరాంకు శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్