నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు మంగళవారం నాడు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తమ విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మేయర్ దంపతులకు హోలీ శుభాకాంక్షలు తెలిపి, రంగులు పూశారు. ఈ సందర్భంగా మేయర్ కూడా పారిశుద్ధ్య కార్మికులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.