ఏప్రిల్ నాలుగున ఎంజీయూలో మెగా జాబ్ మేళా..

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా. హరీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేళాలో 15 కంపెనీలు పాల్గొంటాయి. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాలలో సుమారు 1500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకొని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. మరిన్ని వివరాలకు 7095922360ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్