రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో రూ. 14 వేల కోట్ల వ్యయంతో హ్యాం విధానంలో నిర్మించనున్న డబుల్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,300 కిలోమీటర్ల మేర రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం కనగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ స్థలం, హెలిప్యాడ్, పైలాన్ నిర్మాణ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.