చౌటుప్పల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదిమంది హాజరు కావలసి ఉండగా 12 మంది హాజరయ్యారు. నలుగురు కో ఆప్షన్ సభ్యులకు కోరం మొత్తం మద్దతు తెలిపింది. అనంతరం కమిషనర్ గుప్త వెంకటరామిరెడ్డి, పర్సన్ గంగారం, సందగళ్ల విజయ సతీష్, బాబా షరీఫ్, షేక్ నబిబి జానీ బాబా లకు ప్రమాణం చేయించారు.