ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో సర్పంచ్ కొల్లు నాగయ్య గౌడ్ ఆధ్వర్యంలో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. గ్రామంలోని అన్ని వీధులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలలో ఈ మందును చల్లించారు. దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర వ్యాధుల నుండి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు సభ్యురాలు పల్లె విమల-పరుశరాములు, పల్లె నాగయ్య, పల్లె మధు, పల్లె శివ, గ్రామ పంచాయతీ వర్కర్స్ పల్లె శ్రీను, పల్లె మహేష్ తదితరులు పాల్గొన్నారు.