మున్సిపల్ ఎన్నికల కోడ్: ప్రజావాణి రద్దు - కలెక్టర్ ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఈ నెల 13వ తేదీ వరకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్