ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అయితగోని శేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. శనివారం నల్గొండలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు అత్యధిక స్థానాలు కేటాయించాలన్నారు.