నల్గొండ: డీసీసీ అధ్యక్షుడికి తీవ్ర అవమానం

నల్లగొండ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేతకు పోలీసులు అవమానం చేశారు. దశ దినకర్మ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి వంటి నాయకులతో పాటు వేదికపైకి వెళ్తున్న కైలాస నేతను స్థానిక సీఐ ఆదిరెడ్డి అడ్డుకున్నారు. నాయకులందరినీ అనుమతించి, కైలాస నేతను మాత్రమే అడ్డుకోవడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమేయంతో జరిగిన కుట్ర అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్