మర్రిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం, కుదబక్షపల్లి గ్రామ శివారులో బెట్టింగ్ పెట్టి జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై మునగాల కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, శిరబోయిన మహేందర్, పాశం మహేందర్రెడ్డి, కోట్ల మధుకర్, కారింగ్ నర్సింహతో పాటు మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 14,880 నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.