నల్గొండ చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న కట్ట బాను శనివారం రాత్రి ఫేర్వెల్ పార్టీ కావడంతో ఇంటికి లేటుగా వచ్చాడు. కోపంతో బాను తండ్రి బాలుడిని దారుణంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బానుని కుటుంబ సభ్యులు చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.