ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ, నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్‌లో రేపు ఆసరా పెన్షన్ దారుల సదస్సు నిర్వహించనున్నారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4000 నుంచి రూ.6000కు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్‌ను రూ.2000 నుంచి రూ.4000కు పెంచతామని చెప్పి నెరవేర్చలేదని ఎంఆర్ఫీఎస్-విహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు తెలిపారు.