ధర్వేశిపురం పర్వతగిరిలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లీ దేవాలయంలో, ఆషాఢ మాసం మూడవ ఆదివారం సందర్భంగా ప్రధాన అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, మహిళా భక్తులు పాల్గొన్నారు.