నల్గొండ: గేదెను ఢీకొట్టిన రైలు

తిప్పర్తి సమీపంలో పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై ఉన్న గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి, రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది ప్రస్తుతం మరమ్మతులు చేపట్టి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్