నల్లగొండలో ఘనంగా జరుగుతున్న ఉర్సు ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ షాక్‌తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రియాజ్ అనే వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్సవ కమిటీ, విద్యుత్, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నా, బాధితుడి కుటుంబానికి ఎలాంటి సహాయం అందించలేదని, ప్రమాదకరంగా ఉన్న ఉర్సు షాపుల్లో విద్యుత్ నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది. ఈ సంఘటనతో ఉత్సవాల నిర్వహణపై, భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.