ఎన్ జి కళాశాల రికార్డ్ అసిస్టెంట్ పిచ్చమ్మ పదవీ విరమణ

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 25 ఏళ్లుగా స్వీపర్‌గా, ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్‌గా సేవలందించిన శ్రీమతి పగిడిమర్రి పిచ్చమ్మ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, అధ్యాపక బృందం ఆమెను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పిచ్చమ్మ తన విధులను అత్యంత క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహించారని, ఆమె పనితీరును గుర్తించిన ప్రభుత్వం ఇటీవల పదోన్నతి కల్పించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్