కొత్తపల్లిలో వీధి దీపాలు వెలగక పలు వార్డుల ప్రజలు ఇబ్బంది

నల్గొండ మండలం కొత్తపల్లిలోని పలు వార్డులలో గత రెండు నెలలుగా వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని పలు వార్డులలో వీధి దీపాలు వెలగడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో రాత్రిళ్ళు బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక వార్డు ప్రజలు గురువారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్