పేద ప్రజలకు అన్నదానం చేసిన PHS సమితి అధ్యక్షులు

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఆయన మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. ఆయనతో పాటు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, తెలంగాణ మాదిగ సైన్యం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడుతల నాగరాజు, జర్నలిస్ట్ కలకుంట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్