నల్గొండ జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'ప్రాడ్ కా ఫుల్ స్టాప్' పేరుతో 42 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు డిసెంబర్ 2 నుండి జనవరి 12 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శరచ్చంద్ర పవర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కళాశాల విద్యార్థినులకు, విద్యార్థులకు ఆన్‌లైన్ జూమ్ మీటింగ్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రతి వారం ఒక్క ప్రత్యేక థీమ్‌తో ఈ కార్యక్రమాలు చేపట్టబడతాయి.