నల్గొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మంద నగేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంద నగేష్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి యువత ముందుకు రావాలని సూచించారు.