జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్జాలబావి సమీపంలోని ఎస్‌డబ్ల్యూసీ గోదాములను ఆయన పరిశీలించారు. నల్గొండ కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీలకు ఒకేచోట కౌంటింగ్ నిర్వహించేలా అనువైన భవనాలను చూడాలని, ప్రతి మున్సిపాలిటీకి విడిగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లు ఉండాలని తెలిపారు.