2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ఏప్రిల్ 30 లోపు ముందస్తుగా చెల్లించే వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ రాయితీ గడువు బుధవారంతో ముగియనుంది. జిల్లాలోని కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల పరిధిలో పన్ను చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ అవకాశం కల్పించారు. అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.