ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1న, కార్మిక హక్కుల కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ, ప్రస్తుత పాలకుల విధానాలపై ప్రతిఘటించి పోరాడతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్ తెలిపారు. ఆదివారం నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మే 1న జరిగే బహిరంగ సభ కరపత్రాన్ని నెహ్రూగంజ్ హమాలి యూనియన్ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ విగ్రహం దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.