12వ బెటాలియన్ అన్నే పర్తి నందు పల్స్ పోలియో

అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ యూనిట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ, పరిసర గ్రామాలలోని 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడంపై అవగాహన కల్పించారు. ప్రతి అర్హత గల చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందిని ఆదేశించారు. భవిష్యత్ తరాలను పోలియో నుంచి రక్షించడానికి ప్రతి చిన్నారికి రెండు చుక్కల వ్యాక్సిన్ అందించాలని, ఒక్క చిన్నారిని కూడా వదలకుండా పోలియో చుక్కలు వేయించడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్