నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలి

వానాకాలం పంటల సాగులో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలని, నకిలీ విత్తనాల జోలికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్