నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థి గున్‌రెడ్డి రాధికాయుగేందర్‌రెడ్డి ఓటర్లను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. శనివారం మర్రిగూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్‌గా మార్చేందుకు కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.